ప్రపంచాన్ని ఒణికిస్తోంది కరోనా వైరస్. మన దేశంలో రోజు రోజుకూ పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. దానికి ఒకటే మార్గం. వీలైనంత వరకూ ఇంట్లోనే గడపడం. లాక్ డౌన్ ను వంద శాతం పాటించడం. అలా ఇంటికే పరిమితమైన వాళ్ళలో రోజు కూలీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన రోజు కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఈ మహామ్మారిని ఎదుర్కోవడంతో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన వంతుగా రూ. 50 లక్షల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు. ఈ మేరకు ఒక లేఖను విడుదల చేసారు. ఇందులో ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రజలకు తన వంతుగా సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళనాడు, బాలీవుడ సినీనటులు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు మోహన్ బాబు కరోనా వైరస్ కట్టడికి ఉద్దేశించి భారతీయ సినీ నటులు కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్‌లో నటించిన సంగతి తెలిసిందే కదా.

Leave a comment

error: Content is protected !!