Shopping Cart 0 items - $0.00 0

ఘరానా మొగుడు

  

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఘరానా మొగుడు చిత్రం చాలా ప్రత్యేకమైనది. 1992, ఏప్రిల్ 9 న విడుదలైన ఈ సినిమా దేవీ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో దేవీ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కి..  టాలీవుడ్ లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. తెలుగులో మొట్టమొదటిసారిగా రూ. 10కోట్లు షేర్ రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. అందాల భామలు నగ్మా, వాణీ విశ్వనాథ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి యం.యం.కీరవాణి సంగీతం లోని పాటలు మరింతగా వన్నె తెచ్చాయి. అందులో ముఖ్యంగా బంగారు కోడిపెట్ట పాటైతే.. చిరు డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. రావుగోపాలరావు, ఆహుతి ప్రసాద్, శరత్ పవార్, చలపతిరావు తదితరులు నటించిన ఈ సినిమా నిజానికి 1986 లో కన్నడలో విడుదలైన ‘అనురాగ అరళితు’ చిత్రానికి రీమేక్ వెర్షన్. రాజ్ కుమార్, మాధవి నటించిన ఈ సినిమా శాండిల్ వుడ్ లో  రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. ఇదే సినిమా ఆ తర్వాత తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ , విజయ శాంతి జంటగా ‘మణ్ణన్’ గా తెరకెక్కి అక్కడ కూడా దుమ్ము దులిపేసింది.  ఇక ఇదే సినిమా హిందీలో ‘లాడ్లా’ గానూ, బెంగాలీలో ‘జమైబాబూ జిందాబాద్’ గానూ, ఒడియాలో ‘సిందూర నుహై కేలా ఘరా’ గానూ రీమేక్ అయి ఆయా భాషల్లోనూ అదరగొట్టేసింది.

Leave a comment

error: Content is protected !!