Shopping Cart 0 items - $0.00 0

జోకర్

నటకిరీటి రాజేంద్రప్రసాద్ కెరీర్ లో ది బెస్ట్ అనిపించుకోదగ్గ హార్ట్ టచింగ్ మూవీ ‘జోకర్’. వంశీ దర్శకత్వంలో 1993 లో విడుదలైన ఈ సినిమాలో వాణీ విశ్వనాథ్ కథానాయికగా నటించగా..  మరో అతి ముఖ్యమైన పాత్రను బేబీ షామిలీ పోషించింది. పద్మప్రియ ఆర్ట్స్ బ్యానర్ పై పి.పట్టాభిరామారావు, లక్ష్మణ్ కుమార్ చౌదరి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు గొట్టిముక్కల పద్మారావు సమర్పకుడిగా వ్యవహరించారు. అప్పట్లో ఘన విజయం సాధించిన ఈ సినిమా మరో ప్రత్యేకత ఏంటంటే..  ఈ చిత్రంతోనే వంశీ సంగీత దర్శకుడిగా మారారు. ఈ సినిమా చేసే టైమ్ కి ఇళయరాజా ఫుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండగా..  వంశీనే సంగీతం అందించమని సలహా ఇచ్చారు. దాంతో వంశీ జోకర్ చిత్రానికి తొలిసారిగా ట్యూన్స్ కట్టి.. సినిమాను మ్యూజికల్ గా కూడా హిట్ చేశారు. నిజానికి ఈ సినిమా 1991 లో మలయాళంలో సూపర్ హిట్టైన ‘కిలుక్కం పెట్టి’ అనే సినిమాకి రీమేక్ వెర్షన్. జయరామ్ , సుచిత్రా కృష్ణమూర్తి జంటగా నటించిన ఈ సినిమాను యాక్షన్ చిత్రాల  దర్శకుడు షాజికైలాష్ తెరకెక్కించారు. ఇక ఇదే సినిమా ఆ తర్వాత అంటే..  2010 లో ఉదయ్ చోప్రా, ప్రియాంకా చోప్రా జంటగా..  ‘ప్యార్ ఇంపాజిబుల్’ గా రీమేక్ అవడం విశేషం.

Leave a comment

error: Content is protected !!