ప్రపంచాన్ని ఒణికిస్తోంది కరోనా వైరస్. మన దేశంలో రోజు రోజుకూ పాజిటీవ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. దానికి ఒకటే మార్గం. వీలైనంత వరకూ ఇంట్లోనే గడపడం. లాక్ డౌన్ ను వంద శాతం పాటించడం. అలా ఇంటికే పరిమితమైన వాళ్ళలో రోజు కూలీలు కూడా ఉన్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన రోజు కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో వారిని ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. తెలుగులో చిరంజీవి ఆధ్వర్యంలో విరాళాల సేకరణ జరుగుతోంది. అందులో భాగంగా నటుడు, మాజీ మా అధ్యక్షుడు శివాజీరాజా కరోనా లాక్ డౌన్ వల్ల ఆకలి బాదలతో ఇబ్బంది పడుతున్న పేదవారి కోసం నడుం బిగించారు. ప్రతి రోజు 30 మంది (సినిమా వాళ్ల, బయటి వాళ్ళ అని చూడకుండ) పేదవారికి సహాయం చేస్తూ ,తన వంతు ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు.
ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజూ పేదల సేవలో శివాజీరాజా….
కరోనా లాక్ డౌన్ వల్ల ఆకలి బాదలతో ఇబ్బంది పడుతున్న పేదవారి కోసం శివాజీరాజా నడుం బిగించారు. ప్రతి రోజు 30 మంది (సినిమా వాళ్ల, బయటి వాళ్ళ అని చూడకుండ) పేదవారికి సహాయం చేస్తూ ,తన వంతు ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు pic.twitter.com/UYCXYTJWck
— BARaju (@baraju_SuperHit) April 4, 2020