ప్రపంచ దేశాలన్నీ కరోనా ధాటికి విలవిల్లాడుతున్నాయి. దాని పుట్టిల్లు చైనాలో రచ్చచేసి .. ఇప్పుడు ఇటలీలో మారణహోమం సాగిస్తోంది. అలాగే.. అమెరికాకు కూడా దారుణమైన రీతిలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. భారత్ లో కూడా అలా జరగకూడదనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం 21రోజుల లాక్ డౌన్ ను విధించింది. ఏప్రిల్ 14 తో లాక్ డౌన్ పూర్తి కానున్నది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ఇంట్లో లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు, దీపాలు, టార్చిలైట్లు వెలిగించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
మోదీ పిలుపుపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మన ప్రియతమ ప్రధాని మోదీ పిలుపును గౌరవిద్దామని, ఆ సమయానికి అందరం దీపాలు వెలిగిద్దామని తన పోస్ట్ లో పేర్కొన్నారు. ‘కరోనా’ చీకట్లను పారద్రోలదామని, దేశం కోసం ఒకరికోసం ఒకరు నిలబడదామని పునరుద్ఘాటిద్దామని ప్రజలకు సూచించారు.
Tomorrow #5thApr20 @9PM for 9 minutes, ONLY from the safety of our homes, let us all light lamps to drive away the darkness and gloom of #Corona. Let us show that we are all United in this fight to save humanity. #LightForIndia#StayHomeStaySafe pic.twitter.com/c6olRBsSWP
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 4, 2020