వివాదాలు ఎక్కడుంటాయో రామ్ గోపాల్ వర్మ  అక్కడ ఉంటాడు. అలాగే అపరిశుభ్రత ఎక్కడుంటుందో వైరస్ కూడా అక్కడే ఉంటుంది.  ఎప్పటికప్పుడు జరిగే పరిణామాలపై కామెంట్ చేయడం… వీలైతే ఆ అంశాలపై జెట్ స్పీడ్‌తో సినిమాలు చేయడంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందరికంటే ముందుంటాడు. కరోనా వైరస్‌ కారణంగా యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతుంటే… వర్మ మాత్రం దీనిపై ఎప్పటికప్పుడు తనదైన స్టయిల్లో కామెంట్స్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకరిస్తున్నాడు. తాజాగా దీనిపై సొంతంగా ఓ పాట కూడా పాడేశాడు ఈ కాంట్రవర్సీ డైరెక్టర్.

కరోనా వైరస్‌పై తానే ఓ పాటే రాసి, పాడానని.. దాన్ని బుధవారం విడుదల చేస్తున్నానని వర్మ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. కరోనా వైరస్ పైన నేనే రాసి, పాడిన “కనిపించని పురుగు” అనే పాట ను అనుకున్నట్టుగానే .. ఈరోజు  సోషల్ మీడియాలో వదిలాడు. ప్రస్తుతం ఈ పాట యూ ట్యూబ్ లో వైరస్ అంత ఫాస్ట్ గా వైరల్ అయింది.  కరోనా వైరస్‌కే బాంబు పెడతాడట.. అంతే కాదు కత్తితో పొడుస్తాడట.. ఇంకా ఉంది ఆగండి.. నలిపేద్దాం అంటే అంత సైజు లేదు దానికి.. పచ్చడి చేద్దాం అంటే కండ లేదు దానికి దాని దాని బలం.. అదే దాని దమ్ము. కంటికి కనిపిస్తే దానమ్మ అంటూ ఆయన రాసిన కరోనా పాట  నెటిజెన్స్ కు షాకిస్తోంది.

వర్మ పాటను వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=EFzOA0-jfOo&feature=youtu.be

Leave a comment

error: Content is protected !!