రోజూ ఎవరినో ఒకరిని గిల్లితేనే కానీ రోజు గడవని జీవి ఆర్జీవీ . వివాదాలతో ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఈ దర్శకుడికి, గేయరచయిత జొన్నవిత్తులకు ఆ మధ్య ఒక విషయంలో వివాదం రేగిన విషయం తెలిసిందే.  అప్పుడు జొన్నవిత్తులను తీవ్రమైన పదజాలంతో దూషించాడు వర్మ. దానికి బాగా హర్ట్ అయిన జొన్నవిత్తుల ఆయన మీద సినిమా తీస్తానని అప్పట్లో ప్రకటించారు కూడా. ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు జొన్నవిత్తుల .

తాజాగా జొన్నవిత్తుల ‘ఆర్జీవీ’ లోగోను విడుదల చేశాడు. కింద ట్యాగ్ లైన్ గా ‘రోజూ గిల్లే వాడు’ అంటూ  జత చేశాడు. దీంతో ఈ పిక్ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా దర్శకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ‘తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్లు’ తన పిచ్చి ఇజంతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసఫీ మీద సంధించిన ఈ రామబాణమే ఈ సినిమా అని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చేశానన్నారు. ఇక ఈ సినిమాలో సురేష్ – శ్రద్ధాదాస్ – అమిత్ – పునర్నవి భూపాలం – తేజ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాల కుటుంబరావు నిర్మిస్తున్నారు.

 

 

Leave a comment

error: Content is protected !!