కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులను, పేదలను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు తమ వంతు సహాయంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటించారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు 10 లక్షల రూపాయల సహాయం ప్రకటించిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన స్వగ్రామానికి కూడా అండగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మట్టపర్రు అయిన తన గ్రామానికి సుకుమార్ రూ.5 లక్షల విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. తనలాంటివారు మరెందరో సహాయం చేయడానికి ముందుకు రావాలని సుకుమార్ పిలుపునిచ్చారు. అలాగే ప్రజలందరూ ఇళ్ల దగ్గరే సురక్షితంగా ఉండాలని సూచించారు.

Leave a comment

error: Content is protected !!