టాలీవుడ్ లో ఎవరి అండదండలు లేకుండా .. గాడ్ ఫాదర్ లాంటివారెవరూ లేకుండా స్వయం కృషితో మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఆయన తనయుడిగా సినీ రంగప్రవేశం చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పుడు చరణ్ కు ఇండస్ట్రీలో ఎవరి సపోర్టూ అవసరం లేదు. అతడి హార్డ్ వర్కే అతడి కేరాఫ్ అడ్రెస్ . పదకొండేళ్ల తన సినీ కెరీర్ లో చిరుత, మగధీర, రచ్చ, నాయక్, ధ్రువ, రంగస్థలం లాంటి సినిమాలు అతడి స్టామినాకు మచ్చు తునకలు గా నిలిచాయి. ఇప్పుడు రాజమౌళి మహా మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’ తో త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోబోతున్నాడు. అలాంటి రామ్ చరణ్ పుట్టినరోజు నేడు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ పేజ్ లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని అందరితోనూ పంచుకున్నారు. అదేంటంటే.. చరణ్ పుట్టిన రోజు ఎప్పుడొస్తున్నా.. నా మనసు నాకు తెలియకుండానే స్పందిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటా అని పరిశోధించగా అర్ధమైంది ఏంటంటే.. మార్చ్ 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం. ఆ రోజు రామ్ చరణ్ పుట్టడం యదృఛ్ఛికమే అయినా.. నటులుగా అది మా ఇద్దరినీ బాగా ఎగ్జైట్ చేసే సందర్భం ఇది అంటూ చిన్నపిల్లవాడిగా ఉన్న చరణ్ ను తాను ముద్దాడుతున్న ఫోటోను పోస్ట్ చేసి పుత్రోత్సాహాన్ని చూపించారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజంగా మెగాస్టార్ కి మెగాపవర్ స్టార్ గా తను పుట్టడం నిజంగా తన అదృష్టం. ఈ సందర్భంగా చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే చరణ్..