Shopping Cart 0 items - $0.00 0

సుందరకాండ

చంటి’ అఖండ విజయం తర్వాత విక్టరీ వెంకటేశ్  అదే సంవత్సరం అందుకున్న  మరో సూపర్ హిట్టు  చిత్రం  ‘సుందరకాండ’. అంతేకాదు ‘చంటి’ లో వెంకీ సరసన కథానాయికగా నటించిన అందాల మీనానే ఇందులో హీరోయిన్ గా నటించడం విశేషం. రాఘవేంద్రరావు దర్శకత్వంలో సౌదామిని క్రియేషన్స్ బ్యానర్ పై కె.వి.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ మూవీలో అపర్ణ అనే మరో అమ్మాయి కూడా కథానాయికగా పరిచయం అయింది. వెంకటేశ్ కాలేజ్ ప్రొఫెసర్ గా నటించగా.. అపర్ణ అతడి స్టూడెంట్ గా నటించి తొలి చిత్రంతోనే తన అభినయంతో  ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది. నిజానికి ఈ సినిమా తమిళంలో భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన సుందరకాండం అనే చిత్రానికి రీమేక్. ఈ సినిమా తమిళంలో అఖండ విజయం సాధించడంతో అదే మ్యాజిక్ ను తెలుగులోనూ రీపీట్ చేశారు కే.రాఘవేంద్రరావు . కీరవాణి సంగీత సారధ్యంలోని పాటలు ఇప్పటికీ శ్రోతల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. ఇక సినిమా కథకు ఇన్స్ పైర్ అయి.. హీందీలో అజయ్ దేవ్ గన్ హీరోగా జమీర్ గానూ, మలయాళంలో మమ్ముట్టి హీరోగా ‘మళయెత్తుమ్ ముంబే’ గానూ రీమేక్ అయి అక్కడ ఘన విజయం సాధించాయి.

Leave a comment

error: Content is protected !!