Shopping Cart 0 items - $0.00 0

చిరు మరో ‘చంటబ్బాయ్’

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో తలమునకలై ఉన్నసంగతి తెలిసిందే. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా తర్వాత చిరంజీవి..  త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నట్టు కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. బహుశా వచ్చే ఏడాది ఇద్దరి కాంబోలో సినిమా ఉండొచ్చని సినీ వర్గాల వారి సమాచారం. అయితే ఈ మూవీలో చిరంజీవి పూర్తి స్థాయిలో కామెడీ పండించనున్నాడనే వార్తలు వస్తున్నాయి.

త్రివిక్రమ్ కథ , మాటలు మాత్రమే అందించిన (దర్శకుడు కె.విజయభాస్కర్ ) ‘జై చిరంజీవా’ లో చిరు కామెడీ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత ఇన్నాళ్ళకు మళ్లీ చిరు ఆయన దర్శకత్వంలో సినిమా చేయనుండడం ఆసక్తి రేపుతోంది.  ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ డైరెక్టోరియల్ వెంచర్ లో చిరంజీవి ‘చంటబ్బాయ్’ స్థాయిలోని హాస్యాన్ని పండించబోతున్నాడని టాక్. ఆ మేరకు గురూజీ .. ఒక అదిరిపోయే స్ర్కిప్ట్ రాస్తున్నాడని వినికిడి. మామూలుగానే చిరు కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. దానికి తోడు ఆయన పూర్తి స్థాయిలో కామెడీ పండిస్తే ఇంకేముంది? బాక్సులు బద్దలవ్వాల్సిందే.

Leave a comment

error: Content is protected !!