Shopping Cart 0 items - $0.00 0

మంగమ్మగారి మనవడు

 

 

ట సింహ నందమూరి బాలకృష్ణ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన మొదటి చిత్రం ‘మంగమ్మగారి మనవడు’. కోడి రామకృష్ణ దర్శకత్వంలో భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ పై యస్.గోపాలరెడ్డి నిర్మించిన ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ లో  ఏకంగా 500 రోజులు ఆడి .. రికార్డు కలెక్షన్స్ నమోదు చేసింది. సుహాసిని కథానాయికగా నటించిన ఈ సినిమాలో భానుమతి, గోకినరామారావు, గొల్లపూడి మారుతీరావు, వై.విజయ, అనిత, ఏలేశ్వరం రంగా, బాలాజీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. గణేశ్ పాత్రో సంభాషణలు అందించగా.. కేవీ మహాదేవన్ సంగీతం సమకూర్చారు. 1984లో విడుదలైన ఈ సినిమా నిజానికి బారతిరాజా దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘మణ్ వాసనై’ చిత్రానికి రీమేక్. ఒరిజినల్ వెర్షన్ మెయిన్ థీమ్ ను మాత్రమే తీసుకొని కోడి రామకృష్ణ తనదైన శైలిలో ఎన్నో మార్పులు చేసి  ఈ సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ వెర్షన్ లో పాండ్యన్, రేవతి జంటగా నటించగా.. అందులో హీరో తల్లి పాత్రను తెలుగు వెర్షన్ లో నానమ్మగా మార్చారు. ఆ పాత్రను తెలుగులో భానుమతి పోషించి అబ్బుర పరిచారు. బాలయ్య కెరీర్ లో ఎవర్ గ్రీన్ హిట్టు గా నిలిచిపోయిన ఈ సినిమా తర్వాత .. భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో బాలకృష్ణ వరుస చిత్రాలు చేసి మరిన్ని హిట్స్ సాధించడం విశేషం.

Leave a comment

error: Content is protected !!