మెగా ప్రిన్స్ వరుణ్ తేజ లాస్టియర్ ‘ఎఫ్2, గద్దలకొండ గణేశ్’ చిత్రాలతో వరుస విజయాలు నమోదు చేసుకున్నాడు. ఆ ఉత్సాహంతోనే ఈ ఏడాది మనోడు ఓ స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ మూవీకి కమిట్ అయ్యాడు. సినిమా పేరు ‘బాక్సర్’ (వర్కింగ్ టైటిల్ ). కిరణ్ కొర్రపాటి అనే కుర్రోడు  ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ నెల 24న వైజాగ్ లో  రెగ్యులర్ షూటింగ్ ను  ప్రారంభించిన చిత్ర యూనిట్ ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఆ సందర్భంగా వైజాగ్ బీచ్ లో రిలాక్స్ అవుతున్నట్టు వరుణ్ తేజ  ఒక ఫోటో ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

వైజాగ్ షెడ్యూల్ పూర్తయిందని, అక్కడ  షూటింగ్ జరుపుకోవడం చాలా గొప్ప అనుభవమని ఆ ఫోటోకి తన అభిప్రాయాన్ని కూడా కోట్ చేశాడు. తదుపరి షెడ్యూల్ మరికొద్ది రోజుల్లోనే మొదలు కానుంది. దాదాపు రూ. 35 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటోన్న ‘బాక్సర్’ చిత్రం వరుణ్ తేజ కెరీర్ కు చాలా ప్రత్యేకం కానుంది. ముంబై సుందరి సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా  వరుణ్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!