పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రంతో రెండేళ్ళ గ్యాప్ ను ఫిల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అదే చేత్తో క్రిష్ దర్శకత్వంలో హిస్టారికల్ ఫిక్షనల్ మూవీని కూడా పట్టాలెక్కించాడు. దీనికి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేశారు. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. అలాగే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో కూడా ఒక మూవీని ప్రయార్టీలో పెట్టాడు. ఇప్పుడు వీటితో పాటు మరో దర్శకుడికి కూడా పవర్ స్టార్ ఛాన్స్ ఇస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

పవర్ స్టార్  కెరీర్ బిగినింగ్ లో చేసిన ‘తొలిప్రేమ’ చిత్రం ఏ రేంజ్ లో ఇరగదీసిందో తెలిసిందే. ఈ సినిమాతో కరుణాకరన్ అనే యువ దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో అతగాడు కూడా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘బాలు’ చిత్రం తో మరోసారి పవన్ ను డైరెక్ట్ చేశాడు కానీ.. ఆ సినిమా అంతగా మ్యాజిక్ చేయలేకపోయింది. ఇక ఇప్పుడు కరుణాకరన్ ముచ్చటగా మూడోసారి పవర్ స్టార్ తో కొలాబరేట్ అవనున్నట్టు వార్తలొస్తున్నాయి. కరుణాకరన్ చెప్పిన  ‘తొలిప్రేమ’లాంటి   మరో  క్రేజీ  లవ్ స్టోరీకి  పవన్ కళ్యాణ్ బాగా ఇంప్రెస్ అయ్యాడట. పవర్ స్టార్ ప్రస్తుతం లైన్ లో పెట్టుకొన్న సినిమాలు పట్టాలెక్కాక.. కరుణాకర్ చిత్రం కూడా లైన్ లోకి వస్తుందని సమాచారం. మరి ఈ సినిమా ఇద్దరికీ ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.  

Leave a comment

error: Content is protected !!