తమిళ చిత్రసీమలో ఇటీవల కాలంలో అంచెలంచెలుగా ఎదిగి ‘డైనమిక్ స్టార్’ గా రాణిస్తున్నారు శివ కార్తికేయన్. ‘అభిమన్యుడు’ చిత్రంతో తమిళ , తెలుగు భాషల్లో తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్నారు దర్శకుడు పి.ఎస్. మిత్రన్. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందించిన చిత్రం ‘హీరో’. తమిళంలో మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని ‘శక్తి’ పేరుతో తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు కోటపాడి.జె.రాజేష్. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని ఈ నెల 20 న విడుదల చేస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ నటించిన తొలి దక్షిణాది చిత్రం ఇదే. “హలో” చిత్రం తో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో హీరోయిన్ గా నటించారు. ఇవానా కీలక పాత్రలో కనిపిస్తారు.
దర్శకుడు పి.ఎస్. మిత్రన్ మాట్లాడుతూ, “సూపర్ మాన్, స్పైడర్ మాన్, శక్తి మాన్ అంటే పిల్లలకే కాదు అన్ని వయసుల వారిలో ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. వాళ్ళ ఇన్స్పిరేషన్ తో సాహసాలకు కూడా తెగిస్తుంటారు కొంతమంది. ఈ చిత్రంలో హీరో కూడా అలాంటివాడే. సూపర్ హీరో లా మారి విద్యా వ్యవస్థలోని విషయాలపై ఎలా పోరాడాడనేదే ఈ చిత్ర ప్రధాన సారాంశం. ఇది ఏ భాషకైనా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్. వాస్తవ ఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించాం” అని చెప్పారు.
నిర్మాత కోటపాడి. జె. రాజేష్ మాట్లాడుతూ “ఏదైనా విభిన్న నేపథ్యం లేకపోతే శివ కార్తికేయన్ సినిమా చేయరు. ఈ ‘శక్తి’ సినిమా కూడా అలాంటి విభిన్న నేపథ్యంతో రూపొందింది. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. అభిమన్యుడు తో అదరగొట్టిన దర్శకుడు పి.ఎస్. మిత్రన్, ఎక్స్ట్రాడినరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చూస్తున్నంత సేపు చాలా రియలిస్టిక్ గా అనిపిస్తూ హార్ట్ ని టచ్ చేస్తుంది . అలాగే మెదడులో ఒక ఆలోచన రేకెత్తిస్తుంది. శివ కార్తికేయన్ పాత్రతో పాటు అర్జున్ పాత్ర కూడా సర్ప్రైసింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఈ నెల 20న గ్రాండ్ గా తెలుగులో రిలీజ్ చేస్తున్నాం” అని తెలిపారు.
సాంకేతిక నిపుణులు:
ఈ చిత్రానికి రచన: పి.యస్.మిత్రన్, పార్తిబన్, సవారి ముత్తు, ఆంటోనీ భాగ్యరాజ్, సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: జార్జి.సి.విలియమ్స్, ఎడిటింగ్: రూబెన్, మాటలు: రాజేష్ ఎ మూర్తి,పాటలు : రాజశ్రీ సుధాకర్.
నటీనటులు:
శివకార్తికేయన్, అర్జున్, అభయ్ డియోల్, కల్యాణి ప్రియదర్శన్, ఇవానా తదితరులు.