‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, శ్రీనివాస కళ్యాణం’ లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించిన అందాల నందితా శ్వేతా .. ఇప్పుడో తమిళ చిత్రంలో లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో పవర్ ఫుల్ కాప్ గా రానుంది. సినిమా పేరు ‘ఐపిసి 376’. ఇదో అత్యాచారానికి సంబంధించిన సెక్షన్. దారుణంగా అత్యాచారానికి గురైన ఒకఅమ్మాయి కేస్ ఇన్వెస్టిగేట్ చేసే ఓ లేడీ పోలీసాఫీసర్ .. ఎదుర్కొన్న సవాళ్ళ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ కుమార్ సుబ్బరామన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఒక పక్క నల్లని ముఖం, పైన పెయింటింగ్ తో కాళికాదేవిని తలపించే గెటప్ తోనూ, మరో పక్క పోలీస్ గెటప్ లోనూ ద్విముఖంగా ఫస్ట్ లుక్ లో రివీలైంది కథానాయిక నందితా శ్వేత.  ఈ పోస్టర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. పవర్ కింగ్ స్టూడియోస్ బ్యానర్ పై యస్.ప్రభాకర్ నిర్మిస్తోన్న ‘ఐపిసి 376’ చిత్రం నందితా శ్వేతకు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!