సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫాలోయింగ్ రేంజ్ ఏంటో తెలిసిందే.  రీసెంట్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టడంతో ప్రిన్స్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. దానికి తోడు ఇప్పుడు వారి అభిమాన హీరో ట్విట్టర్ లో ఒక రేర్ ఫీట్ సాధించి మరింత సంతోషాన్ని కలుగ జేశాడు. నిన్న సాయంత్రంతో మహేశ్ బాబు ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 9 మిలియన్స్ ను క్రాస్ చేసింది. సౌత్ లోనే మొట్టమొదటి హీరోగా  అంతటి స్థాయిలో  ట్విట్టర్ ఫాలోయింగ్ ను సంపాదించిన ఘనత మహేశ్ కు చెందడం విశేషాన్ని సంతరించుకుంది.

సోషల్ మీడియాను మహేశ్ బాబు వాడినట్టు మరే హీరో వాడడంటే అతిశయోక్తి కాదు. 2010 లో ట్విట్టర్ అకౌంట్ ను ఓపెన్ చేసిన మహేశ్ .. ఇప్పటివరుకూ అంటే.. ఈ పదేళ్ళలోనూ 9మిలియన్ పీపుల్ మనసు దోచడం అంటే సామాన్యం కాదు. ఈ సందర్భంగా ప్రిన్స్ ట్విట్టర్ లో తన ఫాలోవర్స్ కు కృతజ్నతలు తెలుపుతూ ఒక ట్వీట్ చేశాడు. దాంతో ట్విట్టర్ కింగ్ తమ ప్రిన్స్ అంటూ ఫ్యాన్స్ హంగామా మొదలైంది. మరి మహేశ్ బాబు రికార్డ్ ను ఏ సౌత్ హీరో బీట్ చేస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!