Shopping Cart 0 items - $0.00 0

అమితాబ్, అజిత్ కన్నా భిన్నంగా ‘వకీల్ సాబ్’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ విరామం తర్వాత ‘వకీల్ సాబ్’ మూవీ తో కమ్ బ్యాక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగమేఘాలు మీద చిత్రీకరణ పూర్తి చేసి.. వెంటనే విడుదల చేయాలన్నదే పవన్ సాబ్ తాపత్రయం. అందుకే ఈ సినిమా ఇలా సెట్స్ మీదకు వెళ్లిందో లేదో అప్పుడే దానికి సంబంధించిన ప్రచారాలు కూడా మొదలు పెట్టేశారు మేకర్స్. అందులో భాగంగా  ‘వకీల్ సాబ్’ మూవీలోని పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు. వకీల్ గెటప్ లో గుబురు గడ్డంతో  ఉన్న పవన్ కళ్యాణ్ రెండు కాళ్ళూ బార జాపి ఒక స్టూల్ మీద స్టైల్ గా పెట్టిన లుక్ పవర్ స్టార్ అభిమానుల్ని ఫిదా చేసేసింది.

అయితే  ప్రస్తుతం పవర్ స్టార్ లుక్ మీద సోషల్ మీడియాలో  ఓ రేంజ్ లోచర్చోప చర్చలు జరుగుతున్నాయి. అమితాబ్ బచ్చన్ పింక్ ఫస్ట్ లుక్ ను , అజిత్ నేర్కొండ పార్వై ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను దగ్గర పెట్టుకొని ఆ రెండింటికన్నా డిఫరెంట్ గా రివీలైన పవన్ వకీల్ సాబ్ పోస్టర్ కు మధ్య ఉన్న తేడాలపై డిస్కషన్స్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అమితాబ్ పింక్ పోస్టర్ ను అజిత్ నేర్కొండ పార్వై మేకర్స్ కాపీ కొట్టి యాజిటీజ్ గా దింపేశారని .. ఈ విషయంలో పవర్ స్టారే భిన్నంగా తన ఫస్ట్ లుక్ లో స్టైల్ గా రివీలయ్యాడని మెగాభిమానులు తెగ మురిసిపోతున్నారు. మరి ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఉన్నంత స్టైలిష్ గా పవర్ స్టార్ సినిమాలో పెర్ఫార్మ్ చేస్తాడేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!