పడిపడి లేచె మనసు, రణరంగం, జాను’ చిత్రాలతో వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు యంగ్ హీరో శర్వానంద్. ఈ మూడు చిత్రాలూ మూడు డిఫరెంట్ కథాంశాలతో సరికొత్తగా  తెరకెక్కినవి. అయినా సరే.. వాటిలో సమ్ థింగ్ ఏదో మిస్ అవడంతో.. ప్రేక్షకులు తిప్పికొట్టారు. ఎప్పుడూ వైవిధ్యమైన కథాంశాలనే ఎంచుకొని, విలక్షణమైన పాత్రలు పోషించే శర్వానంద్.. ఇక పై పరాజయాలకు చెక్ పెట్టే దిశగా.. ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.

టాలీవుడ్ లో హీరోగా మారే క్రమంలో శర్వాకు ఎంతో మంది దర్శక నిర్మాతలు పరిచయమవడంతో ఇప్పటికీ వారితో  మంచి రిలేషన్ ను మెయిన్ టెయిన్ చేస్తున్నాడు.ఇన్నాళ్ళూ  ఆ గ్రూప్ లో ఉన్న వారికోసమే కొన్ని  సినిమాలు చేయాల్సి వచ్చి  ఫలితం అనుభవించాడు. అందుకే ఇకపై.. కథల ఎంపిక విషయంలో  ఎలాంటి ఆబ్లిగేషన్స్ కు చోటివ్వకుండా .. మంచి మంచి స్ర్కిప్ట్స్ మీద కాన్సెన్ ట్రేట్ చేయాలని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం ‘శ్రీకారం’ చిత్రం లో శర్వా నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే నెల 24న విడుదల కానుంది. మరి శర్వానంద్ కెరీర్ ఆ చిత్రం తో సక్సెస్ కు శ్రీకారం చుడుతుందేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!