Shopping Cart 0 items - $0.00 0

నిర్ణయం

అక్కినేని నాగార్జున నటించిన దిబెస్ట్ మూవీస్ ను లిస్టవుట్ చేస్తే అందులో టాప్ లో ఉండే మూవీ ‘నిర్ణయం’. మలయాళ అగ్ర దర్శకుడు ప్రియదర్శన్ తొలిసారిగా తెరకెక్కించిన తెలుగు చిత్రంగా ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. 1991 లో వచ్చిన ఈ మూవీ నిజానికి ప్రియదర్శన్ దర్శకత్వంలోనే 1989 లో మోహన్ లాల్ హీరోగా, గీతాంజలి గిరిజ హీరోయిన్ గా నటించిన సూపర్ హిట్ మలయాళ చిత్రం ‘వందనం’ కు రీమేక్ అవడం విశేషం. ఇంగ్లీష్ చిత్రం ‘స్టేకవుట్’ కు ఇన్స్పైర్ అయి ప్రియదర్శన్ మలయాళ నేటివిటీకి తగ్గట్టుగా మలచిన ఈ మూవీ కాప్ స్టోరీ అయినప్పటికీ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కి విశేష ప్రాజాదరణ పొందింది. అలాగే తెలుగులో కూడా నిర్ణయం చిత్రం .. ఇళయరాజా సంగీతంతో మ్యూజికల్ మ్యాజిక్ చేసింది.

Leave a comment

error: Content is protected !!