Shopping Cart 0 items - $0.00 0

చంటి

 

విక్టరీ వెంకటేశ్ కెరీర్ లోనే ది బెస్ట్ అనదగ్గ సినిమా ‘చంటి’. అసలు వెంకీ కెరీర్ నే మలుపుతిప్పిన సినిమా. 1991 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్్స బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆ సంవత్సరం బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. అంతేకాదండోయ్.. కథానాయికగా మీనా కెరీర్ కు కూడా చంటి సినిమా ఒక ప్రత్యేకమైంది. వెంకీ నటనకు తోడు.. మాస్ట్రో ఇళయరాజా మ్యూజికల్ మ్యాజిక్ చేసిన ఈ మూవీ .. ‘చిన్నతంబి’ తమిళ చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రభు, ఖుష్బూ జంటగా నటించిన ఈ సినిమా కి దర్శకుడు పి.వాసు. తమిళ నాట ఈ సినిమా 9 థియేటర్స్ లో సంవత్సరం ఆడింది. అలాగే 47 కేంద్రాల్లో శతదినోత్సవం జరపుకోవడం విశేషం. ఇక ఇదే చిత్రం కన్నడలో రవిచంద్రన్ హీరోగా రామాచారి గానూ, హిందీలో వెంకీనే హీరోగా అనారి గానూ రీమేక్ అయి ఆయా భాషల్లోనూ ఘన విజయం సాధించింది.

Leave a comment

error: Content is protected !!