డిస్కవరి ఛానల్ చూసేవారికి బేర్ గ్రిల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ‘మేన్ వెర్సస్ వైల్డ్’ షో లో అతడు చేసే సాహసాలు ఒళ్లు గగుర్పొడుస్తాయి. ఇప్పుడు ఈ సాహసి చేస్తోన్న మరో పాపులర్ షో ‘ఇన్ టు ది వైల్డ్’ . దీని ప్రత్యేకత ఏంటంటే.. ఈ షో లో సెలబ్రిటీస్ కు ఎంట్రీ ఉంటుంది. ఏదేశానికి చెందిన సెలబ్రిటీతోనైనా గ్రిల్స్ .. సాహసం చేసి వీక్షకుల్ని అబ్బుర పరుస్తుంటాడు. మొన్నామధ్య భారత ప్రధాని మోడిజీ తో అతడు చేసిన అడ్వెంచర్స్ కు భలే అప్లాజ్ లభించింది. ఇప్పుడు సౌత్ సూపర్ స్టార్ తలైవా రజనీ వంతు వచ్చింది.
రజనీకాంత్ లో బేర్ గ్రిల్స్ చేసిన అద్భుతమైన సాహసాలతో కూడిన ‘ఇన్ టుది వైల్డ్’ షో మార్చ్ 23 న డిస్కవరీ చానల్ లో ప్రసారం కాబోతోంది. దీనికి సంబంధించిన టీజర్ ను ఈ రోజే విడుదల చేశారు. ఇందులోని తలైవా .. ఎంట్రీ సీన్ .. సినిమాల్ని తలపించింది. సాల్ట్ అండ్ పెప్పర్ లో కనిపించే స్టైల్ మణ్ణన్ ను పూర్తిగా రివీల్ చేయకుండా.. ప్రేక్షకుల్ని టీజ్ చేసి మరీ వదలిపెట్టింది టీజర్. టీజర్ చివరిలో బైక్ మీద రయ్యిమని దూసుకొస్తూ రజనీకాంత్ షాకిచ్చాడు. మరి ఇన్ టు ది వైల్డ్ షో ను రజనీకాంత్ కోసం ఎంత మంది వీక్షిస్తారో చూడాలి.
Gear up to venture into the wilderness of India with survival expert @BearGrylls and the ultimate superstar @Rajinikanth in an action packed adventure. Premieres 23 March at 8 PM, only on Discovery #ThalaivaOnDiscovery pic.twitter.com/zSS4GsSCL4
— Discovery Channel IN (@DiscoveryIN) February 27, 2020