Shopping Cart 0 items - $0.00 0

నక్కిన దర్శకత్వంలో రవితేజ

 

డిస్కోరాజా’ చిత్రం నిరాశపరిచినా.. మాస్ మహారాజ రవితేజ తదుపరి చిత్రాల లైనప్ షాకింగ్ గా ఉంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ లో నటిస్తున్న రవితేజ .. ‘రాక్షసుడు’ ఫేమ్ రమేశ్ వర్మ దర్శకత్వంలో ఒక మూవీకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్  లుక్ ఆ మధ్య   అభిమానుల్ని ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే… రవితేజ మరో  సినిమా కూడా కన్ఫర్మ్ అయినట్టు వార్తలొస్తున్నాయి.

‘సినిమాచూపిస్తమావ, నేను లోకల్, హలో గురూ ప్రేమకోసమే’ లాంటి యూత్ ఫుల్ మూవీస్ తో ఆకట్టుకున్న త్రినాథరావు నక్కిన .. రవితేజ తో ఒక వెరైటీ మూవీ తెరకెక్కించనున్నాడని టాక్. పీపుల్స్ మీడియా నిర్మాణ సంస్థ ఈ కాంబోని సెట్ చేశారట. ఈ ఏడాదే ఈ మూవీ విడులయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు రమేశ్ వర్మ తో చేయబోయే సినిమా కన్నా ఇదే ముందుగా విడుదల కానుందని వినికిడి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోంది. మరి నక్కిన స్టైలాఫ్ మూవీలో మాస్ రాజా ఏ రేంజ్ లో ఎలివేట్ అవుతాడో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!