Shopping Cart 0 items - $0.00 0

వర్మని పెళ్ళి చేసుకునేదట

 

ఒకప్పుడు గ్రేట్ మేకర్ గా ఇండియన్ ఆడియన్స్ చేత నిరాజనాలందుకున్న  దర్శకుడు  రామ్ గోపాల్ వర్మ  .. గ్రాడ్యుయల్ గా తనకు తానే ఆ మంచి పేరును పోగొట్టుకొని వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారి.. ఇప్పుడు పబ్లిసిటీ స్టంట్ మాస్టర్ అయిన సంగతి తెలిసిందే.  ఇప్పటి పరిస్థితుల్లో ఆయన్ని  ఎంత మంది తిట్టుకుంటారో.. అంతకు రెట్టింపు మంది అభిమానిస్తారని వేరే చెప్పాల్సిన పనిలేదు. అలాంటి వారిలో ‘ఫిదా’ గాళ్ .. గాయత్రి గుప్తా  ఒకరు. అమ్మడు పెద్ద ఫెమినిస్ట్ అన్న సంగతి తెలిసిందే. ‘ఐస్ క్రీమ్2’ మూవీలో కథానాయికగా నటించింది. అలాగే ‘‘ఫిదా’’లో కూడా  ఆవిడగారు నటించారు.

ఇక మేటర్ కొస్తే .. గాయత్రీ గుప్తా రీసెంట్ గా జరిగిన ఒక మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కేస్ట్ మానియా  ఎక్కువని, కేస్టింగ్ కోచ్ సంఘటనలు కూడా ఎక్కువేనని ..  తాను చాలా స్ట్రగుల్ అయ్యానని చెబుతూ.. తనకు వర్మ ‘ఐస్ క్రీమ్ 2’ లో ఛాన్స్ ఇచ్చారని..  ఆయన చాలా జెంటిల్ మేనని .. ఆయనతో సినిమా చేయడమంటే.. మారథాన్ లో పాల్గొనడమేనని..  తన కంటే వయసులో పెద్ద వారైపోయారని .. లేకుంటే  ఆయన్ని  పెళ్ళి కొనేదాన్నని చెప్పి షాకిచ్చింది. అంతేకాదు ..ఆయనంటే తనకు ప్రత్యేక అభిమానం, గౌరవం ఉండబట్టే .. రీసెంట్ గా ఒక పార్టీ లో ఆయన్ను హగ్ చేసుకున్నానని రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి వర్మ గాయత్రీ గుప్తా మాటల్ని ఎలా తీసుకుంటాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!