ఎంత పెద్ద హీరో అయినా ..ఒక్క ప్లాప్ పడితే నేల మీదకు వచ్చేస్తాడు. అలాగే ఎంత బడా దర్శకుడినైనా ఒకే ఒక్క ప్లాప్ వణికిస్తుంది. అందుకే ఆ పరిస్థితికి  ఏ మాత్రం తావివ్వకుండా..  వెంకీ కుడుముల ఇప్పుడు వరుసగా సక్సెస్ తోనే ట్రావెల్ చేస్తున్నాడు. ‘ఛలో’ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. తొలి హిట్టు అందుకున్న ఈ దర్శకుడు రీసెంట్ గా నితిన్ తో ‘భీష్మ’ చిత్రాన్ని తెరకెక్కించి మరోసారి సాలిడ్ హిట్టు కొట్టిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడీ దర్శకుడి రొట్టె విరిగి నేతిలో పడిందని తెలుస్తోంది.

పలు బడా సంస్థలు వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమాలు నిర్మించడానికి క్యూ కడుతున్నట్టు వినికిడి. సినిమా సినిమాకి బడ్జెట్ తో పాటు తన పారితోషికం రేంజ్ ను కూడా ఓ రేంజ్ లో పెంచుకున్న వెంకీ ..  తదుపరి చిత్రానికి భారీ ఎత్తున పారితోషికం డిమాండ్ చేయబోతున్నాడట. ఒక టాప్ హీరోతో వెంకీ కుడుముల తన నెక్ట్స్ మూవీని తెర కెక్కించనున్నాడనే వార్తలొస్తున్నాయి. ఆ హీరో ఎవరో తెలియాలంటే.. కొంత కాలం ఆగక తప్పదు. ప్రస్తుతం వెంకీ దానికి స్ర్కిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడట. స్ర్కిప్ట్ లాక్ చేశాకా..  హీరో ను ఎన్నుకోనున్నారని టాక్. మరి వెంకీ తర్వాత మూవీకి హీరో ఎవరవుతారో చూడాలి.

Leave a comment

error: Content is protected !!