మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. ప్రస్తుతం రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి చెర్రీ చేయబోయే తదుపరి చిత్రం పైనే ఉంది. చాలా మంది బడా దర్శకులు చెర్రీ తో సినిమా తెరకెక్కించే ప్రయత్నాలు సాగిస్తున్నారు. అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు సైతం లిస్ట్ లో ఉన్నా.. ఇద్దరికిద్దరు ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న కారణంగా చెర్రీ తదుపరి చిత్రం తెరకెక్కించే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో చెర్రీ నెక్స్ట్ మూవీని తెరకెక్కించే దర్శకుల్లో విక్రమ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
‘మనం’ లాంటి చిత్రంతో అక్కినేని ఫ్యామిలీకి మెమరబుల్ గిఫ్ట్ నిచ్చిన విక్రమ్ కుమార్ .. ఆ తర్వాత రూపొందించిన హలో, నానీ గ్యాంగ్ లీడర్ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. అయినా సరే అతడి ట్రాక్ రికార్డ్ పట్టించుకోకుండా.. కేవలం అతడి టాలెంట్ మీద నమ్మకంతో రామ్ చరణ్ … అతడి స్టోరీ లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఫుల్ స్ర్కిప్ట్ వినిపిస్తేనే ప్రొసీడ్ అవుతానని ఖచ్చితంగా చెప్పేశాడట. విక్రమ్ కుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ చిత్రానికి అదిరిపోయే స్ర్కిప్ట్ సమకూర్చే పనిలో ఉన్నాడట. నిజానికి నానీ గ్యాంగ్ లీడర్ ప్లేస్ లో బన్నీతో సినిమా ఉండాలి. అయితే అల్లు అర్జున్ కు త్రివిక్రమ్ స్టోరీ సెట్ అవడంతో .. అతడు అటు షిఫ్ట్ అయ్యాడు. అప్పుడు బన్నీ మిస్ అయినా విక్రమ్ ఇప్పుడు చెర్రీని పట్టాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ స్పెషల్ కాంబో మూవీ ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్ళనుందట. మరి విక్రమ్.. చెర్రీకి ఏ రేంజ్ మూవీ ఇస్తాడో చూడాలి.