విష్వక్ సేన్ హీరోగా .. శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఇన్వెస్టిగేటివ్  థ్రిల్లర్ హిట్. ఫుల్ ఫామ్ లో  టైటిల్ కు హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనే జెస్టిఫికేషన్ ఇచ్చారు. రీసెంట్ గా విడులైన ఈ సినిమా టీజర్ అందరినీ భలేగా థ్రిల్ చేసింది. ఈ నేపథ్యంలో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈరోజు హిట్ సినిమాలోని ఒక హైలైట్ సీన్ ను స్నీక్ పీక్ గా విడుదల చేశారు.

కనిపించకుండాపోయిన ఒక యువతిని ఎవరో చంపేసి ఒక చోట పాతిపెట్టారనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. హిట్ టీమ్ అక్కడికి చేరుకుంటుంది. కానీ బాడీ కనిపించదు. ఇంతలో హీరో విష్వక్ అక్కడ దగ్గరలో ఉన్న మూడు  కలుపు మొక్కల పువ్వుల్ని సేకరించి ..  ఇవి ఒకటిగా కలిసి ఎక్కడ పెరుగుతున్నాయో అక్కడ తవ్వమని చెబుతాడు. ఆశ్చర్యం.. నిజంగా అతడు చెప్పినట్టే అక్కడ డెడ్ బాడీ దొరుకుంది. ప్రేక్షకులు థ్రిల్ కు గురయ్యే ఇలాంటి సీన్స్ సినిమాలో కోకొల్లలని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. మరి ఈ నెల 28న వస్తోన్న  ‘హిట్’ సినిమా .. సార్ధక నామధేయం అవుతుందేమో చూద్దాం.

 

Leave a comment

error: Content is protected !!