Shopping Cart 0 items - $0.00 0

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మహేశ్?

‘చందమామ కథలు, గుంటూరు టాకీస్, గరుడవేగ’ చిత్రాలతో టాలీవుడ్ లో  సమ్ థింగ్ డిఫరెంట్ అనిపించుకున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. అతి తక్కువ బడ్జెట్ లో హై క్వాలిటీ ఔట్ పుట్ ఇవ్వడం మనోడి టాలెంట్. అలాంటి  ప్రతిభావంతమైన దర్శకుడికి మహేశ్ బాబు కాంపౌండ్ లో చోటు దక్కడం ఆశ్చర్యేమీ లేకపోయినా..  ఓ చిన్నదర్శకుడు చెప్పిన కథకు మహేశ్ బాబు నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రావడం  అన్నది అందరూ నోరు వెళ్ళబెట్టే  అంశమే. ప్రవీణ్ సత్తారు చెప్పిన కథకు సూపర్ స్టార్ 80 శాతం సుముఖంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.

కొన్ని డిస్కషన్లు, కొన్ని మార్పులతో కథ ఒక కొలిక్కిరాబోతోందని సమాచారం. ఆ మేరకు నమ్రతా శిరోద్కర్ నుంచి కూడా ఈ దర్శకుడికి గ్రీన్ టిక్కు పడిందని వినికిడి. మహేశ్ బాబు ప్రస్తుతం పరశురామ్ తో సినిమా చేసే హడావిడిలో ఉన్నాడు.  పనిలో పనిగా.. ప్రవీణ్ దర్శకత్వంలోని సినిమా కూడా ఘట్టమనేని వారి కాంపౌండ్ నుంచి ఆమోద ముద్ర వేయించుకుంటే.. సినిమా లాంఛ్ అవడమే తరువాయి అంటున్నారు. మరి ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మహేశ్ బాబు నటించనుండడం మాత్రం టాలీవుడ్ లో ఇప్పుడు వైరల్ గా మారింది. మరి ప్రవీణ్ సత్తారు .. మహేశ్ బాబు ను ఏ స్థాయిలో ఎలివేట్ చేస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!