లాస్టియర్ ‘సీత , రణరంగం’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని నిరాశపరిచిన కాజల్ అగర్వాల్ .. తమిళంలో మాత్రం ‘కోమాలి’ చిత్రంతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తమిళ క్వీన్ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ లోనూ, దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న చిత్రంలోనూ, అలాగే.. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’లోనూ నటిస్తోంది. అదే చేత్తో బాలీవుడ్ లో ‘ముంబై సాగా’లో కూడా నటిస్తోంది. అయితే ఈ ఏడాది తెలుగులో మాత్రం అమ్మడు మంచు విష్ణు ‘మోసగాళ్ళు’ చిత్రం లో మాత్రమే నటిస్తోంది. గత ఏడాది ‘ఓటర్’ మూవీతోనూ, అంతకు ముందు ‘ఆచారి అమెరికా యాత్ర’ తోనూ ప్లాప్స్ టేస్ట్ చేసిన మంచు విష్ణుకు ఈ సినిమా చాలా క్రూషియల్ . సో మొత్తానికి హిట్టు కోసం పరితపిస్తోన్న విష్ణు, కాజల్ కలయికలో తెరకెక్కుతోన్న ‘మోసగాళ్ళు’ మూవీ ముంబై లో జరిగిన అతి పెద్ద ఐటి స్కామ్ ఆధారంగా తెరకెక్కుతోంది..

హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ చిన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ను ఏవీఏ ఎంటర్ టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్  సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా మోసగాళ్ళు లో కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు . అను అనే పాత్రలో స్లీవ్ లెస్ ధరించి, చందమామలా కాజల్ రివీలైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటికే అమెరికాలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకువచ్చిన ‘మోసగాళ్ళు‘ టీమ్ .. హైద్రాబాద్ లో తదుపరి షెడ్యూల్  ను మొదలు పెట్టనుంది. ఈ ఏడాది వేసవిలో విడుదల కానున్న ఈ సినిమా మంచు విష్ణు , కాజల్ అగర్వాల్ ల కెరీర్ ను ఏ రేంజ్ లో మలుపు తిప్పుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!