Shopping Cart 0 items - $0.00 0

కిలికీ భాషలో వెబ్ సైట్

 

‘బాహుబలి ది బిగినింగ్’ లో .. మహిష్మతి రాజ్యం మీద దండయాత్రం చేసిన కాలకేయులు కిలికీ భాషలో మాట్లాడుకొని అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవవడంతో పాటు.. అందులోని ఆ భాషకు కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. దాని మీద చాలా మంది స్పూఫులు కూడా చేసుకున్నారు. సింగర్ స్మిత అయితే.. ఏకంగా ఆ భాషలో మహా కిలికి అనే పాటను సైతం పాడి.. వైరల్ అయింది కూడా. ఆ తర్వాత వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ లో కాలకేయులు ప్రస్తావన లేకపోవడంతో .. కిలికి భాష ను తర్వాత కాలంలో జనం  మరిచిపోయారు.  కానీ  ఆ భాష సృష్టి కర్త, ‘బాహుబలి’ తమిళ వెర్షన్ డైలాగ్ రైటర్ అయిన మదన్ కార్కీ మాత్రం దాన్ని వదిలిపెట్టలేదు.

ఏదో అర్ధం పర్ధంలేని పదాల్ని కిలికి భాషగా పరిచయం చేశారని చాలా మంది అనుకున్నారు. కానీ మదన్ కార్కీ ఒరిజినల్ గా దాన్నో ప్రత్యేకమైన భాషగానే రూపకల్పన చేశాడు. అంతేకాదు ఈ భాషలో ఏకంగా ఒక వెబ్ సైట్ నే నెలకొల్పాడు. త్వరలో  ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి ఈ వెబ్ సైట్‌ను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఆవిష్కరించబోతుండటం మరో విశేషం. ఈ సందర్భంగా రండి.. కిలికి భాష నేర్చుకోండి.. ప్రపంచంలోనే అత్యంత సులువుగా నేర్చుకోదగ్గ భాష ఇది అంటూ మదన్ కార్కీ టీం జనాలకు ఆహ్వానం పలుకుతుండటం అందరినీ ఆకట్టుకుంటోంది. భవిష్యత్తులో కిలికి భాష కూడా ప్రాంతీయ భాషల్లో ఒకటిగా గుర్తింపు పొందుతుందేమో చూడాలి.

Leave a comment

error: Content is protected !!