‘క్షణం, గూఢచారి , ఏజెంట్ ఆత్రేయ’ లాంటి చిత్రాలతో పాటు.. రీసెంట్ గా ‘అశ్వథ్థామ’ మూవీ థ్రిల్లర్ జోనర్ లో వచ్చి  టాలీవుడ్ ప్రేక్షకుల్ని భలేగా ఆకట్టుకున్నాయి.  ఈ నేపథ్యంలో మరిన్ని మూవీస్ ఆసక్తి రేపే కథాకథనాలతో ఇన్వెస్టిగేటివ్ మోడ్ లో రానున్నాయి. ఆ జాబితాలో త్వరలో విడుదల కానున్న మరో సినిమా ‘హిట్’ (హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్  టీమ్ ).  ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీతో హీరోగా పరిచయమై.. ‘ఫలక్ నుమా దాస్’ మూవీ తో హీరోగా మంచి మార్కులేయించుకున్న విష్వక్ సేన్ ఇందులో హీరో. హిట్ టీమ్ ను లీడ్ చేసే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్నాడతడు.  త్వరలో విడులకు సిద్దమవుతోన్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్ని ప్రారంభించారు మేకర్స్ . మొన్నామధ్య సినిమా టీజర్ ను విడుదల చేస్తే.. ఈ రోజు హిట్ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

ఒకమ్మాయి మిస్సింగ్ కేస్ తో రంగంలోకి దిగిన విష్వక్ సేన్ సరైన క్లూస్ దొరక్క బుర్ర బద్దలు కొట్టుకుంటాడు. ఆ క్రమంలో  అతడిలో కోపం , ఫ్రస్టేషన్ కలుగుతాయి. ఆ కేస్ ను ఛాలెంజింగ్ గా తీసుకున్న అతడు ఎన్ని సమస్యల్ని ఫేస్ చేశాడో ఇందులో రివీలైంది. శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. ఇంకా మురళీ శర్మ పోలీస్ ఆఫీసర్ గా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు.  మరి ‘హిట్’ మూవీ   విష్వక్ సేన్ కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!