Shopping Cart 0 items - $0.00 0

‘విరాటపర్వం’లో నందితాదాస్

 

నందితాదాస్ పేరు వినగానే అందరికీ  ఆమె వెర్సటాలిటీ గుర్తుకొస్తుంది. హిందీ నుంచి మొదలు పెట్టి తెలుగు వరకూ దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ నటించి .. ఎన్నో జాతీయ,  అంతర్జాతీయ అవార్డుల్ని కైవసం చేసుకున్న గొప్ప నటీమణి  ఆమె.  ఎయిటీస్ లో తన నట ప్రస్థానం ప్రారంభించిన ఆమె .. ఇప్పటికీ వైవిధ్యమైన పాత్రల్నీ పోషిస్తూనే ఉంది. అలాంటి నటీమణి .. దగ్గుబాటి రానా ‘విరాట పర్వం’ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూండడం ఆసక్తి రేపుతోంది. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో నైంటీస్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ను ఫిక్షనల్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు యువ దర్శకుడు వేణు ఊడుగుల.

‘విరాటపర్వం’లో నందితాదాస్ పాత్ర కు సంబంధించిన  వర్కింగ్ స్టిల్స్ ను విడుదల చేశారు మేకర్స్. నైంటీస్ వాతావరణంలోని ఒక ఇంట్లో టైపు రైటర్ ముందు ఏదో ముఖ్యమైన పని చేసుకుంటున్న నందితాదాస్ స్టిల్  ..ఈ సినిమా తాలుకా ఇంటెన్సిటీని తెలియచెబుతోంది. ఆ స్టిల్స్ చూస్తుంటే.. ఆమె కూడా నక్సల్స్ గ్రూప్ లోనే యాక్టివ్ మెంబర్ అని అర్ధమవుతోంది. దగ్గుబాటి రానాతో పాటు సాయిపల్లవి, ప్రియామణి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తోన్న ‘విరాట పర్వం’ చిత్రం ఈ ఏడాది చివరిలో విడుదలకానుంది. తెలుగులో ‘కమ్లీ’ తర్వాత నందితా నటిస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం.   మరి ఈ సినిమా నందితా దాస్ కు ఏ స్థాయిలో పేరుతెచ్చిపెడుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!