ఒకప్పుడు సౌత్ లో యాక్షన్ హీరోగా ఒక వెలుగు వెలిగిన అర్జున్ సర్జా .. ఇప్పుడువిలన్ గానూ, ప్రధాన పాత్రలూ పోషిస్తూ .. తన కెరీర్ ను మరింత స్పీడ్ గా పరుగుపెట్టిస్తున్నాడు. ప్రస్తుతం ప్రస్తుతం పలు తమిళం, కన్నడ చిత్రాల్లో కీరోల్స్ చేస్తోన్న ఆయన.. ఇప్పుడో బాలీవుడ్ మూవీ లో కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడు. భారత క్రికెట్ జట్టులో ఒకప్పుడు  స్పిన్నర్ గా పేరు తెచ్చుకున్న హర్భజన్ సింగ్ .. మొట్టమొదటసారిగా నటుడిగా బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు. ‘ఫ్రెండ్ షిప్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించిన ఫష్ట్ లుక్ పోస్టర్ ను ఈ మధ్య విడుదల చేశారు. ఇందులో అర్జున్ సర్జా  కూడా నటిస్తున్నాడంటూ..  ఈ సినిమా మేకర్స్ మరో పోస్టర్ ను విడుదల చేసి మరీ డిక్లేర్ చేశారు. పోస్టర్ లో రివీలైన అర్జున్ స్టన్నింగ్ లుక్ నెటిజెన్స్ ను ఆకట్టుకుంటోంది.

జాన్ పాల్ రాజ్ అండ్ శ్యామ్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఫ్రెండ్ షిప్’ చిత్రాన్ని జేపీఆర్ అండ స్టాలిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సైతం విడుదల కానున్నఈ సినిమా ఈ సంవత్సరమే థియేటర్స్ లోకి రానుంది. ఇక మరో ముఖ్యమైన విశేషమేంటంటే.. హర్భజన్ సింగ్ ఈ సినిమాతో పాటు సంతానం హీరోగా నటిస్తోన్న ‘డిక్కిలూనా’ చిత్రంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మరి ఫ్రెండ్ షిప్ మూవీ అర్జున్ సర్జాకు ఏ రేంజ్ లో క్రేజ్ తెస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!