తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్.. మంచి ఫామ్ లోఉన్నాడు. లాస్టియర్ ‘మిస్టర్ లోకల్, కౌశల్యా కృష్ణమూర్తి, నమ్మవీట్టు పిళ్లై, హీరో’ చిత్రాలతో సక్సెస్ రేట్ పెంచుకొన్న మనోడు .. ఈ ఏడాది ‘డాక్టర్’ గా రాబోతున్నాడు. పదిమంది ప్రాణాలు కాపాడవల్సిన డాక్టర్ .. కొన్ని అనుకోని పరిస్థితుల్లో  పలువురి ప్రాణాలు తీయాల్సి వస్తుంది. అప్పుడు ఆ డాక్టర్ పడే మానసిక వేదన ఈ  మూవీ కాన్సెప్ట్. నెల్సన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ యస్.కే బ్యానర్ పై ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది.

ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదలయింది. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా కార్తికేయన్ కెరీర్ లోనే ప్రత్యేకం కానుంది. డాక్టర్ గెటప్ లోశివకార్తికేయన్ ఒక చెయిర్ లో కూర్చుని ఉంటాడు. అతడి చుట్టూ కొన్ని   కత్తులుంటాయి. రక్తంతో తడిసిన అతడి చేతిలో మరో కత్తి. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఇదేదో థ్రిల్లర్ మూవీ అనిపిస్తోంది. అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా తెలుగులో కూడా విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

 

 

Leave a comment

error: Content is protected !!