Shopping Cart 0 items - $0.00 0

హ్యాపీ బర్త్ డే సుకుమార్

 

వైవిధ్యమైన కథాంశాలతో సినిమా తెరకెక్కించి.. ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఇంటెలిజంట్ దర్శకుడు సుకుమార్. సినిమాల మీద వల్లమాలిన అభిమానంతో మేథ్స్ లెక్చరర్ ఉద్యోగాన్ని సైతం వదలుకొని హైదరాబాద్ పయనమైన అతడు.. ఒక సరికొత్త ప్రేమకథను తయారు చేసుకొని టాలీవుడ్ లో ఎక్కి దిగని గడపలేదంటే అతిశయోక్తి కాదు. ఫైనల్ గా అతడి ప్రతిభను గుర్తించిన నిర్మాత దిల్ రాజు ఆర్య సినిమాతో అతడికి దర్శకుడిగా తొలి అవకాశాన్నిచ్చాడు. కేవలం రూ. 4కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకున్న ఆ సినిమా ఏకంగా రూ. 50కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి… సుకుమార్ ను టాలీవుడ్ కే టాప్ డైరెక్టర్ ను చేసింది. ఇక అక్కడనుంచి ఆర్య2, జగడం, 100 % లవ్, వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో , రంగస్థలం లాంటి చిత్రాలతో టాలీవుడ్ లోనే నెంబర్ వన్ దర్శకుడిగా ఎదిగాడు. త్వరలో అల్లు అర్జున్ తోనే మరో సినిమాకు సన్నాహాలు చేసుకుంటోన్న సుకుమార్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ కు విషెస్ తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!