యాంగ్రీమేన్ రాజశేఖర్ ‘కల్కి’ తర్వాత మళ్ళీ ముఖానికి రంగేసుకోలేదు. ఆ సినిమా కానీ.. ‘గరుడవేగ’ తరహాలో మంచి విజయం సాధించి ఉంటే.. ఈ పాటికి ఆయన కొత్త సినిమా సెట్స్ మీద ఉండేదేమో తెలియదు కానీ.. ఆయన తదుపరి చిత్రం సన్నాహాలు మాత్రం నత్త నడకతో సాగుతున్నాయి. వీరభద్ర చౌదరి దర్శకత్వంలో రాజశేఖర్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నారనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఆయన తో పాటు మరో యంగ్ హీరోగా కూడా నటించబోతున్నాడట.
ఇందులో రాజశేఖర్ సరసన అందాల శ్రీయా శరణ్ నటించనుందని సమాచారం. శ్రీయా ఒకప్పుడు టాలీవుడ్ లో అందరు అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. ఒక్క రాజశేఖర్ తోనే ఆమె నటించలేదు. ఇప్పుడా లోటు తీరుస్తున్నాడట వీరభద్రం. ప్రస్తుతం రాజశేఖర్ వయసుకు తగ్గట్టుగానే శ్రియాను హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమాతో వీరభద్రం, రాజశేఖర్ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి.