ఇళయ దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీ ‘మాస్టర్’. ఎక్స్.బీ. ఫిల్మ్ క్రియేటర్స్ పతాకంపై జేవియర్ బిట్టో నిర్మిస్తోన్న ఈ సినిమా విజయ్ 64వ చిత్రం. మాళవికా మోహనన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఇంకా అర్జున్ దాస్, ఆండ్రియా , శాంతను ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తోన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఆలపించిన కుట్టి స్టోరీ అనే లిరికల్ సాంగ్ ను వేలెంటైన్స్ డే కానుకగా ఈ రోజు విడుదల చేశారు. అనిరుధ్ రవిచంద్రన్ బాణీ కట్టిన ఈ పాట యూ ట్యూబ్ లో సంచలనం రేపుతోంది.

గతంలో ఇదే పేరుతో టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అందులో కూడా చిరు తొలిసారిగా తమ్ముడు తమ్ముడూ అనే పాట పాడడం విశేషం. ఈ పాటను .. అందులోని విజవల్స్ ను చూస్తుంటే.. విజయ్ ఒక కాలేజీకి లెక్చరర్ గా నటిస్తున్నట్టు అనిపిస్తోంది. మరి  చిరు మాస్టర్ లాగానే ఏదైనా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తోఈ సినిమా  తెరకెక్కిందో లేక స్ట్రైట్ నెరేషన్ తో వస్తుందో చూడాలి.

కుట్టిస్టోరీ లిరికల్ సాంగ్ కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=gjnrtCKZqYg&feature=youtu.be

 

 

Leave a comment

error: Content is protected !!