అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న న్యూజెన్ ప్రేమకథా చిత్రం ‘లవ్ స్టోరీ’. రెండు వేరు వేరు సామాజిక వర్గాలకు చెందిన యువతీ యువకుల ప్రేమ , దాని పర్యావసానాలపై ప్రదానంగా ఫోకస్ చేయనున్న ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని మొదలు పెట్టారు మేకర్స్. అందులో భాగంగా  ఇందులోని ఒక లవ్ సాంగ్  ను ఈ రోజు వేలెంటైన్స్ డే కానుకగా విడుదల చేశారు.

సిహెచ్.పవన్ సంగీతం అందిస్తోన్న లవ్ స్టోరీ సినిమా నుంచి ‘హే పిల్లా పరుగున పోదామా’ అంటూ సాగే మెలోడీ వీడియో సాంగ్ ను మ్యూజికల్ ప్రివ్యూ  గా వదిలారు. చైతన్య పింగళి రాసిన ఈ గీతాన్ని హరిచరణ్ ఆలపించాడు.  రకరకాల లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈపాటలో సాయిపల్లవి చైతూకు ఒక హాట్ కిస్ ఇవ్వడం విశేషం. యూ ట్యూబ్ లో ఈ పాటకు నాలుగు లక్షల అరవై వేలు పైచిలుకు హిట్స్ పడ్డాయి. అలాగే..  రికార్డ్ స్థాయిలో 51 వేల లైక్స్ వచ్చాయి. మరి ఈ పాట వెండితెరపైఏ రేంజ్ లో పాపులర్ అవుతుందో చూడాలి.

వీడియో సాంగ్ కోసం కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=KRmbTCvJ6ns

Leave a comment

error: Content is protected !!