Shopping Cart 0 items - $0.00 0

సినిమా ముందు ఇగో ఎగిరిపోయింది

ప్ర‌కాశ్‌రాజ్‌.. ఎలాంటి క్యారెక్ట‌ర్‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల న‌టుడు. కృష్ణ‌వంశీ.. ఎలాంటి క‌థ‌నైనా త‌న స్టైల్‌లో సినిమాగా మ‌ల‌చ‌గ‌ల ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ తీయ‌డంలో ఎక్స్‌ప‌ర్ట్. ఇది స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌. కానీ వీరిద్ద‌రు కేవ‌లం ఇగో ప్రాబ్లెమ్స్‌తో నాలుగేళ్లు మాట్లాడుకోలేదు. అయితే ఒక్క సినిమా వారిద్ద‌రినీ క‌లిపింది.కృష్ణ‌వంశీ ప్ర‌తీ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్ వుంటాడు. ఆయ‌న క్యారెక్ట‌రైజేష‌న్ కూడా స్పెష‌ల్‌గా డిజైన్ చేస్తాడు కృష్ణ‌వంశీ. అలాంటిది నాలుగేళ్ల పాటు కృష్ణ‌వంశీ మూవీలో న‌టించ‌లేదు ప్ర‌కాశ్ రాజ్‌. అస‌లు ఈ ఇద్ద‌రి ప‌ట్టింపుకు జీవితాంతం మాట్లాడుకోరేమో అనుకున్నారు చాలామంది. కానీ గోవిందుడు అంద‌రివాడేలే వారిద్ద‌రినీ క‌లిపింది. అది కూడా చాలా భాగం షూట్ అయ్యాక అనుకోని ప‌రిస్థితుల్లో క‌ల‌వాల్సి వ‌చ్చింది.
గోవిందుడు అంద‌రివాడే చిత్రంలో హీరో రామ్ చ‌ర‌ణ్ అయినా తాత పాత్ర బాల‌రాజే కీల‌కం. గోదావ‌రి జిల్లాలోని ఓ అంద‌మైన ప‌ల్లెటూరిలోని ఫ్యామిలీ స్టోరీ ఇది. అయితే బాల‌రాజ్ పాత్ర‌లో డిగ్నిటీ, నేటివిటీ మెయిన్ ఇంపార్టెంట్‌. ఈ పాత్ర‌కు మొద‌ట త‌మిళ్ న‌టుడు రాజ్‌కిర‌ణ్‌ను సెలెక్ట్ చేసాడు కృష్ణ‌వంశీ. ఆయ‌న‌తో చాలా పార్ట్ షూట్ కూడా కంప్లీట్ చేసాడు. డిగ్నిటీగా క‌నిపిస్తున్నాడు కానీ తెలుగు నేటివిటీ మిస్స‌వుతుంది. ఆలోచ‌న‌ల్లో ప‌డ్డాడ‌ట కృష్ణ‌వంశీ. మెగాస్టార్ చిరంజీవి కూడా నేటివిటీ తేడా కొడుతుంది చూసుకో అని చెప్పాడ‌ట‌. రామ్ చ‌ర‌ణ్ బాబాయి క్యారెక్ట‌ర్ చేసిన హీరో శ్రీ‌కాంత్ ప్ర‌కాశ్ రాజ్ అయితే బెట‌ర్ అని సూచించాడ‌ట‌. కానీ అడ‌గ‌లేడు. ఎందుకంటే నాలుగేళ్ల‌నుంచి ప్ర‌కాశ్‌రాజ్‌తో మాట‌ల్లేవ్‌. కానీ చిరంజీవి జోక్యంతో ఇద్ద‌రూ క‌లిసిపోయారు. అలా గోవిందుడు అంద‌రివాడేలో బాల‌రాజ్‌గా ప్ర‌కాశ్‌రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. అన్న‌ట్టు ఇదే సినిమాలో హీరో శ్రీ‌కాంత్ చేసిన క్యారెక్ట‌ర్ కోసం మొద‌ట వెంక‌టేష్‌ను అనుకున్నార‌ట‌. కానీ డేట్స్ అడ్జ‌స్ట్ కాక‌పోవ‌డంతో శ్రీ‌కాంత్ చెర్రీ బాబాయిగా ఎంట్రీ ఇచ్చాడు.

Leave a comment

error: Content is protected !!