లాస్టియర్ ‘వెంకీ మామ’తో సూపర్ హిట్టు ఖాతాలో వేసుకున్నాడు యంగ్ డైరెక్టర్ బాబీ. దీని తర్వాత అతడు ఏ సినిమా చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. నిజానికి మనోడు వెంకీ ‘నారప్ప’ చిత్రానికి యాక్షన్ డైరక్టర్ గా పనిచేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే..  ప్రస్తుతం బాబీ యంగ్ హీరో రామ్ ను బుట్టలో పడేసే పనిలో బిజీగా ఉన్నాడట. రీసెంట్ గా  రామ్ కు ఒక బ్రహ్మాండమైన స్టోరీ లైన్ చెప్పాడట. దానికి బాగా ఇంప్రెస్ అయిన రామ్ .. సినిమా తప్పకుండా చేద్దామని చెప్పాడట.

‘ఇస్మార్డ్ శంకర్’ తో బీభత్సమైన ఫామ్ లోకొచ్చిన రామ్ .. ప్రస్తుతం తమిళ ‘తడం’ మూవీ రీమేక్ ‘రెడ్’ లో నటిస్తున్నాడు. అన్ని కుదిరితే రామ్ నెక్ట్స్ చేయబోయే సినిమా బాబీదే అవుతుందని అనుకుంటున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకోనున్నఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి బాబీ రామ్ బాబుతో ఏ తరహా సినిమా తెరకెక్కిస్తాడో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!