కార్తీ హీరోగా తమిళనాట ఘనవిజయం సాధించిన చిత్రం ‘ఖైదీ’. అదే టైటిల్ తో ఈ సినిమా టాలీవుడ్ లోనూ మ్యాజిక్ చేసింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో ఉత్కంఠతను రేకెత్తించే సన్నివేశాలతో సౌత్ జనాన్ని కట్టిపడేసిన ఈ సినిమా ఇప్పుడు  బాలీవుడ్ లో రీమేక్ కానుండడం ఆసక్తిగా మారింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ , రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నటించబోతున్నట్టు సమాచారం. ఆల్రెడీ ఈ సినిమాను చూసిన హృతిక్ రోషన్  త్వరలోనే తన నిర్ణయాన్ని తెలియచేస్తాడట.

ఎర్లియర్ గా ‘వార్’ సినిమాతో టైగర్ ష్రాఫ్ తో కలిసి ఓ యాక్షన్  హిట్టు ఖాతాలో వేసుకున్న హృతిక్ రోషన్ ..ఈ సారి ‘ఖైదీ’ రీమేక్ తో తనలోని ఊరమాస్ హీరోని వెలికి తీయనుండడం ఆసక్తిగా మారింది. రెండు నెలల్లో బాలీవుడ్ సెట్స్ మీదకు వెళ్ళనున్నఈ సినిమా కోసం నిర్మాతలు .. దర్శకుడిగా  లోకేశ్ కనగరాజ్ నే మళ్ళీ రంగంలోకి దింపుతున్నారట. తమిళ వెర్షన్ లాగానే ఇందులో కూడా నో హీరోయిన్ ..  నో సాంగ్స్ అని తెలుస్తోంది. మరి ఖైదీగా హృతిక్ ఏ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!