గంభీరమైన వాయిస్.. స్మైలీ ఫేస్ .. మ్యాన్లీ లుక్  కలిస్తే  జగపతిబాబు. టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి .. గ్రాడ్యువల్ గా కేరక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయి.. ఫైనల్ గా విలన్ గా సెటిల్ అయిన ఆయన .. ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ నటుడు. ఎలాంటి విలక్షణమైన పాత్రకైనా అందరి దర్శకులకూ  ది బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఆయనే. మూడు దశాబ్దాల సినీ కెరీర్ లో  దాదాపు అన్నిరకాల జోనర్ లోనూ సినిమాలు చేసి సత్తా చాటుకున్నారు మన జగ్గూదాదా.

1989 లో ఒక మాస్ యాక్షన్ చిత్రంతో అందులోనూ డ్యూయల్ రోల్ తో ‘సింహస్వప్నం’ అనే చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబుకు.. మాస్ హీరో అవ్వాలనే కోరిక నెరవేరలేదు. అందుకే ఆ తర్వాత నుంచి  ఫ్యామిలీ  సినిమాలతో మెప్పించి..  మహిళా ప్రేక్షకుల మనసుల్లో మరో శోభన్ బాబు గా స్థిరపడ్డారు. ఆ సినిమాలే జేబీని టాలీవుడ్ లో ఓ మంచి హీరోని చేశాయి. ఆ ఇమేజ్ తో కొంత కాలం పాటు జగపతిబాబు టాలీవుడ్ లో ట్రావెల్ చేశారు. అయితే ఆ తర్వాత నుంచి ఆయనకి కొంత కాలం పాటు సరైన సినిమానే పడలేదు. దాంతో  ఆయన   2010లో బాలయ్య ,బోయపాటి చిత్రం ‘లెజెండ్’ తో విలన్ గా సరికొత్త అవతారమెత్తారు. ఆ మూవీలో ని ఆయన విలనిజానికి దాసోహమైన జనం .. జేబీని అదే పాత్రలో చాలా  సినిమాల్లో ఆదరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం జగపతి బాబు చేతిలో బోలెడన్ని సౌత్ మూవీస్ ఉన్నాయి.  అన్ని విలక్షణమైన పాత్రలే. అన్నిచిత్రాల్లోనూ ది బెస్ట్ పెర్ఫార్మర్ అనిపించుకోవాలని తపిస్తోన్న జగ్గూదాదా నేటితో 58 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్డ్ డే జగ్గూదాదా

Leave a comment

error: Content is protected !!