Shopping Cart 0 items - $0.00 0

ఇలియానా ధైర్యం అలా మిస్సయిందా?

 

 

ఇలియానా.. అందాల గోవా సుంద‌రి. అతి త‌క్కువ కాలంలో కోటి రూపాయ‌ల రెమ్యునరేష‌న్ తీసుకునే హీరోయిన్‌గా ఎదిగింది. ఇలియానాను హీరోయిన్‌గా దేవ‌దాస్ మూవీతో ప‌రిచ‌యం చేసింది టాలీవుడ్డే. కానీ వాస్త‌వానికి టాలీవుడ్‌లో ఇలియానా సైన్ చేసిన మొద‌టి సినిమా మాత్రం దేవ‌దాస్ కాదు.
విష‌యంలోకి వెళ్తే.. దేవ‌దాస్ చిత్రం కోసం హీరో రామ్‌ను సెలెక్ట్ చేసుకున్న వైవిఎస్ చౌద‌రి హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. అప్ప‌టికే తేజ తీస్తున్న ధైర్యం సినిమా కోసం ఎంపిక‌య్యింది ఇలియానా. ఈ అమ్మాయి అయితే ఈ సినిమాకు సూట్ అవుతుంది అనుకున్నాడు వైవిఎస్ చౌద‌రి. కానీ అప్ప‌టికే ధైర్యం సినిమా కొంత వ‌ర‌కు షూట్ అయ్యింది. దాంతో ఇలియానా హీరోయిన్‌గా తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌కు ఫుల్ స్టాప్ ప‌డింది. అలాంటి సిచ్యుయేష‌న్ నుంచి దేవదాస్‌లో ఇలియానా ఎంట్రీ విచిత్రంగా జ‌రిగింది.ధైర్యం సినిమాకు ఇలియానాను ఎంపిక చేసారు తేజ. కానీ ఆ సినిమాకు కాస్త ఫాస్ట్‌లుక్ ఉన్న అమ్మాయి కావాలి. ఇలియానా చాలా సాఫ్ట్‌గా క‌నిపిస్తుండ‌టంతో అంత హ్యాపీగా లేడు తేజ‌. కానీ ఇలియానాను తీసేసే ఛాన్స్ లేదు. అదే టైమ్‌లో దేవదాస్ కోసం ఇలియానాను తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌తో వైవిఎస్ చౌద‌రి ఉన్న‌ట్టు తెలుసుకుని.. ఇలియానా హ‌ర్ట్ కాకుండా చెప్పాల్సిన ప‌ద్ద‌తిలో చెప్పి దేవ‌దాస్ ప్రాజెక్ట్‌లో జాయిన్ చేసాడు తేజ‌. అలా దేవ‌దాస్‌కు రిచ్ అమెరిక‌న్ గ‌ర్ల్‌ఫ్రెండ్ దొరికిన‌ట్ట‌యింది.

Leave a comment

error: Content is protected !!