Shopping Cart 0 items - $0.00 0

విజయ్ సేతుపతి సరసన సమంతా

లాస్టియర్ ‘మజిలీ, ఓ బేబీ’  చిత్రాలతో  వరుసగా విజయం సాధించిన  సమంతా అక్కినేని ఈ ఏడాది ‘జాను’ చిత్రంతో హిట్టు బోణీ కొట్టింది. ఈ మూడు చిత్రాల్లోని అమ్మడి పెర్ఫార్మెన్స్ కు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ప్రస్తుతం ఈ స్టార్ డాటర్ ఇన్ లా టాలీవుడ్ లోనూ , కోలీవుడ్ లోనూ  మరిన్ని  క్వాలిటీ స్ర్కిప్ట్స్ ను సెలెక్ట్ చేసుకుంటోంది. అందులో ఒకటి,   ‘కాదు వాకుల రెండు కాదల్’ మూవీ. నయనతార బోయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండడం విశేషం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్న ఈ సినిమా ఓ వైవిధ్యమైన ప్రేమకథగా తెరకెక్కనుంది.

లాస్టియర్ కోలీవుడ్ లో సూపర్ హిట్టైన ‘సూపర్ డీలక్స్’ లో విజయ్ సేతుపతి, సమంతా ఇద్దరూ నటించారు. కానీ ఒకే ఫ్రేమ్ లో కలిసి నటించలేదు. ‘కాదు వాకుల రెండు కాదల్’ సినిమా కథ కు బాగా ఇంప్రెస్ అయిన సమంతా ఈ సినిమాలో నటించడానికి ముందుకొచ్చిందట. అయితే ఇందులో మరో స్టార్ హీరోయిన్ కూడా నటించనుందట. ఆమె మరెవరో కాదు నయనతార. అయితే  ఈ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో నటిస్తున్నారన్న విషయంపై ఎలాంటి క్లారిటీ లేకపోయినా .. దర్శకుడు విఘ్నేశ్ శివన్ కాబట్టి.. నయనతార కూడా కచ్చితంగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. 7 స్ర్కీన్ స్టూడియోస్ బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మిస్తోన్న ‘కాదువాకుల రెండు కాదల్’ మూవీ సమంతాకు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!