‘వెంకీమామ’తో లాస్టియర్ కు సూపర్ హిట్టుతో సెండాఫ్ ఇచ్చిన అక్కినేని నాగచైతన్య .. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ మూవీని రిలీజ్ కు రెడీ చేస్తోన్న సంగతి తెలిసిందే. భానుమతిగా ఉభయరాష్ట్రాల ప్రేక్షకుల్ని తెలంగాణా స్లాంగ్ తో ‘ఫిదా’ చేసిన తమిళ పొణ్ణు సాయిపల్లవి మొదటిసారిగా ఈ మూవీలో చైతూతో జోడీ కడుతోంది. నైజాం కుర్రాడిగా తెలంగాణా స్లాంగ్ లో మొదటిసారి డైలాగ్స్ పలకనున్న నాగచైతన్య .. ఈ సినిమాతో ఈ వేలెంటైన్స్ డేకి కుర్రకారుకి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట.
ప్రేమికుల రోజును పురస్కరించుకొని.. ‘లవ్ స్టోరీ’ మూవీకి సంబంధించిన తొలి సింగిల్ ను విడుదల చేసి యూత్ లో ఆసక్తిని రేకెత్తిస్తారట. ఆ తర్వాత వరుసగా సింగిల్స్ ట్రీట్ ఉంటుందట. ఆపై టీజర్ అండ్ ట్రైలర్స్ హాడావిడి కూడా ఉండబోతోందని వినికిడి. రెండు విభిన్న కులాలకు చెందిన ప్రేమికులు .. ఇరు కుటుంబాల వారిని ఎలా కన్విన్స్ చేస్తారు? తమ ప్రేమను ఎలా గెలిపించుకుంటారు? అనే కాన్పెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట శేఖర్ కమ్ముల. ‘ఫిదా’ తరహాలో .. హార్ట్ టచింగ్ ఎమోషన్సే కాన్ఫ్లిక్ట్ గా మారి ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయట. మరి ఫిబ్రవరి 14న చైతూ, సాయిపల్లవి ఇవ్వబోయే సర్ ప్రైజ్ ఎలా ఉండబోతోందో చూడాలి.