Shopping Cart 0 items - $0.00 0

టెర్రరిస్ట్ గా జాను

నిన్న జెస్సీగా.. నేడు జానుగా యువత హృదయాల్ని కొల్లగొట్టింది అందాల సమంత. ఇప్పటివరుకూ ఇటు  అందంతోనూ, అటు అభినయంతోనూ దక్షిణాది తెరమీద మ్యాజిక్ చేసిన ఆ స్టార్ డాటర్ – ఇన్ -లా ఇప్పుడు తన కెరీర్ లోనే మొట్టమొదటసారిగా ఓ వెబ్ సిరీస్ తో  డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. అంతేకాదండోయ్ .. ఈ సిరీస్ లో అమ్మడు టెర్రరిస్ట్ గా ఒక నెగెటివ్ రోల్ లో నటించబోతోంది. మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న  అమెజాన్ ప్రైమ్  ఒరిజినల్ లో భాగంగా  త్వరలో స్ట్రీమింగ్ కానున్న ‘ది ఫ్యామిలీ మేన్‘ సీజన్ 2 లో  ఆమె నటించబోతోంది.

ఆల్రెడీ ‘ది ఫ్యామిలీ మేన్’ సీజన్ వన్ సూపర్ హిట్టైన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి సీజన్ 2 పై పడింది. మనోజ్ బాజ్ పాయ్ తో పాటు ప్రియమణి కూడా నటిస్తోన్న ఈ సిరీస్ ను బాలీవుడ్ మేకర్స్ రాజ్ అడ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఒక మీడియా ఇంటరాక్షన్ లో సమంతా ‘ ది ఫ్యామిలీ మేన్’ సీజన్ 2 లో తాను నటిస్తోన్నట్టు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సిరీస్ లో సమంత మీద హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయట. గతంలో ‘పత్తు ఎన్రదుక్కుళ్ల’ అనే విక్రమ్ తమిళ సినిమాలో గ్యాంగ్ స్టర్ గాళ్ గా చిన్నపాటి ఫైట్స్ చేసిన సమంతా.. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లో పూర్తి స్థాయి యాక్షన్ గాళ్ గా ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!