Shopping Cart 0 items - $0.00 0

ట్రైలర్ టాక్ : లవ్ అండ్ పెయిన్ కలగలిసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’

 

‘డియర్ కామ్రేడ్’ తర్వాత టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ .  ‘ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, ఉంగరాల రాంబాబు’ చిత్రాల తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితమే విడుదలైంది. మొత్తం నాలుగు ప్రేమకథల సమాహారంగా .. లవ్ అండ్ పెయిన్ కాన్సెప్ట్ తో కలర్ ఫుల్ గా .. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కింది ఈ చిత్రం . వేలెంటైన్స్ డే కానుకగా ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

’ఈ ప్రపంచంలో నిస్వార్ధమైనది ఏదైనా ఉందంటే.. అది ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమలోని నేను అనే రెండక్షరాలు ఒక సునామీనే రేపగలవు .. ఐ వాంటు టూ బీ దిస్ వరల్డ్ ఫేమస్ లవర్ ’ అనే విజయ్ వాయిస్ మీద డిఫరెంట్ షాట్స్ లో బిగిన్ అవుతుంది ట్రైలర్. ఆ తర్వాత విజయ్ , రాశీఖన్నా మీద కొన్ని రొమాంటిక్ సీన్స్ వస్తాయి. ఆ వెంటనే మరో హీరోయిన్ ఐశ్వర్యారాజేశ్ చీరతో ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూసి.. ‘మీ ఆడోళ్ళకస్సలు ఆగదానే .. బట్టలుంటే ఒంటిమీద ఏసేయడమేనా?’  అంటూ విజయ్ విసుక్కుంటూ డైలాగ్ విసురుతాడు.  ఆ తర్వాత మరో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత మరో కథానాయికను చూపిస్తారు.  ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నలుగురు హీరోయిన్స్ మీద ఓ నాలుగు ప్రేమకథలు రన్ చేస్తాడని చెప్పవచ్చు. వీటిలో విజయ్ బొగ్గుగని కార్మికుడిగానూ, పైలట్ గానూ ఇలా.. రకరకాల గెటప్స్ లో కనిపిస్తాడు. మొత్తం మీద వరల్డ్ ఫేమస్ లవర్ .. అర్జున్ రెడ్డి ఛాయలతో మరోసారి యూత్ ఫుల్ గా రాబోతున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఈ లవర్.. ఏ స్థాయిలో వరల్డ్ వైడ్ ఫేమస్ అవుతాడో చూడాలి.

ట్రైలర్ కోసం కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=g8DNVJvE-rE&feature=youtu.be

Leave a comment

error: Content is protected !!