అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్నీ.. జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని.. ఇలా ప్రతీ ఒక్కరూ ఏదో ఒక టైమ్‌లో అనుకోవల్సిందే.
ఇలాంటి పరిస్థితే చియాన్ విక్రమ్ కు కూడా ఎదురయింది.
విక్రమ్ కెరియర్ బిగినింగ్‌లో ఆఫర్స్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ట్రైల్స్‌లో భాగంగా మణిరత్నం ఆఫీస్‌లో కూడా ఫోటోలు ఇచ్చాడు. ఈ ఫోటోస్ నచ్చడంతో మణిరత్నం విక్రమ్ ని పిలిపించాడు. అంతేకాదు మనీషా కొయిరాలతో కలిపి ఒక ఫోటో షూట్ కూడా చేసారు. యాక్టర్ కాబోతున్నాను అది కూడా మణిరత్నం డైరెక్షన్లో అనే పాయింట్ విక్రమ్ హ్యాపీనెస్‌ను రెండింతలు చేసింది. కానీ ఈ హ్యాపీనెస్ ఎక్కువ కాలం నిలవలేదు.
ఇంతకీ మణిరత్నం ఫోటో షూట్ చేసి ఛాన్స్ ఇస్తానని చెప్పిన మూవీ బొంబాయి. అయితే ఫోటో షూట్ తర్వాత విక్రమ్ ను కాకుండా అరవింద్ స్వామితో చేయించాడు మణిరత్నం. దాదాపు 14ఏళ్ల తర్వాత రావణ్ మూవీలో యాక్ట్ చేయమని మణిరత్నం నుంచి విక్రమ్ కు కాల్ వచ్చింది. మొత్తానికి వద్దన్న డైరెక్టర్‌తోనే పిలిపించుకుని సినిమా చేసేంత రేంజ్ కు ఎదిగాడు విక్రమ్. కష్టే ఫలి అన్న సూత్రానికి విక్రమ్‌ను ఓ ఎగ్జాంపుల్ చూపించొచ్చు.