Shopping Cart 0 items - $0.00 0

యన్టీఆర్ సినిమాను రిజెక్ట్ చేసిన పీపుల్ స్టార్

జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా కెరియ‌ర్ ను మొద‌లుపెట్టి హీరో స్థాయికి ఎదిగారు పీపుల్‌స్టార్ ఆర్. నారాయ‌ణ మూర్తి. గ్లామ‌ర్ ఫీల్డ్‌లో వున్నాడ‌నే కానీ ఆ సౌక‌ర్యాల‌కు త‌గ్గ‌ట్టుగా బ్ర‌త‌క‌లేదు.
చాలా సామాన్యుడిలా క‌నిపిస్తారు ఆర్ నారాయ‌ణ మూర్తి. బ‌స్సులు, ఆటోల్లో ప్ర‌యాణిస్తూ క‌నిపిస్తారే త‌ప్ప సెల‌బ్రిటీ హోదాకు త‌గ్గ‌ట్టు కార్ల‌లో ఎప్పుడూ క‌నిపించ‌రు. అంత సింప్లిసిటీ ఒక్క ఆర్ నారాయ‌ణ మూర్తికి మాత్ర‌మే సాధ్య‌మైంది.
ఆర్ నారాయ‌ణ‌మూర్తిని వ్య‌క్తిగానూ, ఆర్టిస్ట్‌గానూ విప‌రీతంగా ఇష్ట‌ప‌డే వ్య‌క్తుల్లో పూరీ జ‌గ‌న్నాధ్ ఒక‌రు. అందుకే కెమెరామేన్ గంగ‌తో రాంబాబు సినిమాను పీపుల్‌స్టార్‌కి అంకితం చేసారు. ఇంత అభిమానం ఉన్న పూరీ నిజాయితీగ‌ల పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్‌ను ఆర్ నారాయ‌ణ మూర్తి కోసం డిజైన్ చేసారు.ఆ క్యారెక్ట‌ర్ ఆయ‌న చేస్తే ది బెంచ్‌మార్క్ ఔట్‌పుట్ వ‌స్తుంద‌నేది పూరీ ఆలోచ‌న‌. అదే విష‌యం ఆర్ నారాయ‌ణ మూర్తి కి చెప్పార‌ట‌. ఇలా ఎంత చెప్పినా ఆయ‌న ఒప్పుకోలేదట‌. చిన్న స్థాయి నుంచి హీరోగా రెడ్‌స్టార్ పీపుల్‌స్టార్ లాంటి బిరుదుల‌కు ప‌ర్‌ఫెక్ట్ ఆప్ష‌న్‌గా ఎదిగారు ఆర్ నారాయ‌ణ మూర్తి. ఇదే విష‌యం పూరీ కి గుర్తు చేస్తూ తిరిగి చిన్న క్యారెక్ట‌ర్లో, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానో చేయ‌డం త‌న సిద్దాంతానికి విరుద్ద‌మ‌ని చెప్పి పూరీనే క‌న్విన్స్ చేసాడ‌ట పీపుల్ స్టార్‌. అయితే ఈ డిస్క‌ష‌న్ జ‌రిగిందంతా టెంప‌ర్ మూవీలో పోసాని కృష్ణ ముర‌ళీ పోషించిన క్యారెక్ట‌ర్ కోసం. ఆర్ నారాయ‌ణ మూర్తి చేయ‌న‌ని చెప్పినా పూరీ మాత్రం ఆ క్యారెక్ట‌ర్ మూర్తి అనే పేరు పెట్టి అభిమానం చాటుకున్నాడు. ఇది టెంప‌ర్ మూవీకి సంబంధించిన ఓ ఫిల్మీ ఫ్యాక్ట్‌.

Leave a comment

error: Content is protected !!