Shopping Cart 0 items - $0.00 0

యన్టీఆర్ నో చెప్పాడు.. కార్తీ ‘ఊపిరి’ అయ్యాడు

ఏ ఇండిస్ట్రీలోనైనా కొన్ని కాంబినేష‌న్‌కి మంచి క్రేజ్ వుంటుంది. అలా ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేసిన కాంబో ఎన్టీఆర్, ఎన్నాఆర్‌ల‌ది. ఇద్దరూ క‌లిసి చేసిన మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ ని బాగా ఎంజాయ్ చేసారు, ఆద‌రించారు. ఇదే విధంగా బాల‌య్య‌, నాగ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా వ‌స్తే బాగుంటుందని చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఫ్యాన్సే కాదు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా ఈ కాంబోతో మ‌ల్టీస్టార‌ర్ చేసార‌ని చాలా ట్రై చేసార‌ట‌. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు.ఈ విధంగా ఈ కాంబినేష‌న్ మిస్ అయిన‌ప్ప‌టికీ సీతారామ‌రాజు మూవీలో హ‌రికృష్ణ, నాగ్‌ల కాంబినేష‌న్ ను చూసి అక్కినేని నంద‌మూరి ఫ్యాన్స్ ఓ మేర‌కు హ్యాపీ ఫీల‌య్యారు. ఎంతైనా ఈ రెండు ఫ్యామిలీల హీరోలు క‌లిసి ఓ సినిమా చేస్తే అది ఫ్యాన్స్‌కే కాదు కామ‌న్ ఆడియెన్స్ కి కూడా ఓ ఎక్సైట్‌మెంటే. అయితే ఈ రెండు ఫ్యామిలీల నుంచి ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ రావాల్సి వుంది. కానీ జ‌స్ట్‌లో మిస్స‌యింది.అస‌లు మేట‌రేంటంటే… ఇన్‌ట‌చ‌బుల్స్ అనే ఇంగ్లీష్ మూవీ కి రీమేక్ గా త‌మిళ‌, తెలుగులో రిలీజ‌యి హిట్ట‌యిన సినిమా ఊపిరి. ఈ సినిమాలో నాగార్జున‌కు కేర్ టేక‌ర్‌గా కార్తి న‌టించాడు. కార్తీ ప‌ర్‌ఫార్మెన్స్ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంది. వాస్త‌వానికి కార్తీ ప్లే చేసిన క్యారెక్ట‌ర్‌ను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేయాల్సివుంది. కానీ ఎన్టీఆర్ డేట్స్ ప్రాబ్ల‌మ్ వ‌ల్ల కుద‌ర‌క ఈ సినిమాను చేయ‌లేక‌పోయాడు. అలా నాగార్జున ఎన్టీఆర్ కాంబినేష‌న్ మిస్స‌యింది.

Leave a comment

error: Content is protected !!